నిశిత పరిశీలనా, దగాకోరు పరిశీలనా?: 'జన సాహితి'తో మా విభేదాలు! తీగ లాగారు, డొంకంతా కదిలింది!

Front Cover
Sweet Home Publications - Art - 400 pages

1. నిశిత పరిశీలనా, దగాకోరు పరిశీలనా? 

  చలం సాహిత్యం మీద, నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు అనే ఆయన రాసిన "నిశిత పరిశీలన..." పుస్తకం మీద స్పందనగానే ఈ పుస్తకం రాయవలసి వచ్చింది. చలం సాహిత్యంలో, ఒక్క మంచి అంశం అయినా లేదనీ, ఆ సాహిత్యం పూర్తిగా తిరస్కరించ దగ్గదనీ, నిమ్మగడ్డ పరిశీలన తేల్చింది. ఆ నిశిత పరిశీలన, ఎంత నిశితంగా, ఎంత వివేకంగా సాగిందో వివరిస్తూ చేసిన విమర్శ ఇది. 


2. 'జన సాహితి'తో మా విబేధాలు 

  భూస్వామ్య విధానాన్నీ, సామ్రాజ్య వాదాన్నీ వ్యతిరేకించే లక్ష్యం గల ప్రణాళికతో 1978లో ఏర్పడిన 'జన సాహితి' సంఘంలో, నేను ప్రారంభం లోనే చేరడమూ, సంవత్సరన్నర కాలం లోనే బైటికి రావడమూ, రెండూ జరిగాయి. నా లాగే మరి కొందరు సభ్యులు కూడా ఆ సంఘం నించి బైటికి వచ్చారు. అప్పటి నించీ మా మీద ఆ సంఘం ద్వారా దుష్ప్రచారం సాగుతోంటే, ఆ సందర్భంలో ఈ పుస్తకం రాయవలసి వచ్చింది. ప్రజా సంఘాలు, ఎంత ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తాయో చూడడానికి ఇది ఒక ఉదాహరణ. 


3. తీగ లాగారు, డొంకంతా కదిలింది! 

  ఇద్దరు భార్యాభర్తల విరోధాలలో, నేను ఆ భార్య పట్ల సానుభూతితో ఆమెకు సహాయం చేయడం వల్ల, భర్త వేపు నించి నా మీద ఒక నీచమైన కరపత్రం వచ్చింది. 1987లో, ఆ కరపత్రానికి జవాబుగానే ఈ పుస్తకం రాయ వలసి వచ్చింది. ఆ కరపత్రం రాకపోతే, అందులో నా గురించి నీచమైన విషయాలు లేకపోతే, ఈ పుస్తకంతో అవసరం వుండేది కాదు. 

From inside the book

What people are saying - Write a review

We haven't found any reviews in the usual places.

Common terms and phrases

About the author

రంగనాయకమ్మ 1955 నించి తెలుగులో కధలూ, నవలలూ, వ్యాసాలూ రాయటం ప్రారంభించారు. ఇప్పటికి (2019 వరకూ) దాదాపు 60 కధలూ, 15 నవలలూ, 20 వ్యాస సంపుటాలూ, కొన్ని అనువాదాలూ, కొన్ని ఇంగ్లీషు పుస్తకాలకు పరిచయాలూ రాశారు; అనువాదాలు రాశారు. ఆమె రచనలలో కొన్ని: బలిపీఠం, స్వీట్‌హోమ్, అంధకారంలో, జానకి విముక్తి, అమ్మకి ఆదివారం లేదా, రామాయణ విషవృక్షం, మార్క్సు కేపిటల్ పరిచయం, ఇదండీ మహా భారతం, ఏం చెప్పాయి వేదాలు?, పిల్లల కోసం ఆర్థిక శాస్త్రం, ఒకటో తరగతి తెలుగు వాచకం. 

Bibliographic information